ఒకప్పుడు స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రతినాయకుడి పాత్ర ద్వారా మొదలు పెట్టాడు. ప్రతినాయకుడి పాత్రలో నటించడం మొదలు పెట్టాక జగపతి బాబుకు వరుస అవకాశాలు వరిస్తున్నాయి.
అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన విలన్ గా కూడా హిట్స్ అందుకుంటున్నాడు.విలన్ గా. క్యారెక్టర్ ఆర్టిష్టుగా. రాణిస్తున్నాడు. చాలా సినిమాల్లో ఈయన పేరే వినిపిస్తుంది. ఇక ఈయన చేతిలో ప్రెజెంట్ చాలా సినిమాలు ఉన్నాయి.. మరి అందులో అర్జున్ దర్శకత్వంలో తెరకెక్క బోయే సినిమా కూడా ఉంది.. విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా ఈ సినిమా అర్జున్ దర్శకత్వంలోనే తెరకెక్కనుంది. ఈ సినిమాతోనే అర్జున్ కూతురు తెలుగు తెరకు పరిచయం అవుతుంది.

ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం జగపతిబాబు ను తీసుకున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. అర్జున్, జగపతి బాబు స్నేహం ఇప్పటిది కాదు.. హనుమాన్ జంక్షన్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు.. అప్పటి నుండి స్నేహితులుగా మారిపోయారు.. ఇక స్నేహితులు ఒకే సినిమా కోసం పని చేస్తుండడంతో మరోసారి వీరి స్నేహాన్ని బయట పెట్టారు.
జగపతి బాబుకు అర్జున్ స్వయంగా హెయిర్ స్టైల్ ను సెట్ చేస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటోను స్వయంగా జగపతిబాబు పోస్ట్ చేసాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. సండే యాక్షన్ విత్ యాక్షన్ కింగ్ అర్జున్. ఇంకా ఎవరైనా లైన్లో ఉన్నారా అంటూ ఒక మాట అన్నారు .. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో.. హిట్ అవుతుందో లేదో చూడాలి.. ఇక ఈ సినిమాను శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటెర్నేష్నల్ నిర్మిస్తుండగా.. కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: