తెలుగు సినీపరిశ్రమలో ఘట్టమనేని ఫ్యామిలీ కి ఎంతటి ఖ్యాతి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ తన యాక్టింగ్ తో అప్పట్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. వరుస చిత్రాలతో అగ్ర స్థాయికి చేరుకున్నారు. అలాగే స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తండ్రి కి తగ్గ తనయుడు గా అగ్ర స్థాయి హీరో గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అదే విధంగా వీరి పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలిసిందే. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తన మేనమామ కూతురు అయిన ఇందిరా దేవిని మొదట పెళ్లి చేసుకోగా... నటి విజయ నిర్మలను రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే వీరిద్దరికీ కలిసి పిల్లలు లేరు. ఇందిర దేవి గారి రెండవ కుమారుడు మహేష్ బాబు. ఈ మధ్య నటి విజయ నిర్మల గారు 2019 లో మరణించగా ,ఇటీవల ఇందిర దేవి కూడా అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. సాధారణంగా ఈమె బయట ప్రపంచానికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఇపుడు ఈమె మరణానంతరం ఈమెకు సంబందించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈమె పేరుపై ఉన్న కోట్ల ఆస్తిపాస్తుల విషయం పై పలు ఆసక్తికర విషయాలు వినపడుతున్నాయి. ఇందిర దేవి వివాహం చేసుకున్న తరవాత ఆమెకు కట్న కానుకలుగా కోట్ల విలువ చేసే ఆస్తిపాస్తులు వచ్చాయట.  

అయితే వాటన్నిటినీ ఇపుడు తనయుడు మహేష్ కి కాకుండా కుతుర్లకు వెళ్లేలా ముందే అన్ని సిద్దం చేశారట ఇందిర దేవి. మహేష్ బాబు స్వతహాగా కోట్లల్లో సంపాదించారు, సంపాదిస్తున్నారు.. కాగా తమ కూతుర్లకు తన వారసత్వ ఆస్తిని ఇస్తే బాగుంటుందని భావించి ఆ విషయాన్ని అప్పట్లో తన తనయుడుతో చెప్పగా అందుకు మహేష్ కూడా ఒప్పుకున్నారు అని దాని ప్రకారమే ఇపుడు ఆ ఆస్తులు అన్ని ఆమె కుమార్తెలకు సొంతం అయ్యాయి అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం పై ఎటువంటి అధికారిక సమాచారం లేదు కానీ మహేష్ కు అంతటి ఉదార స్వభావం ఉందని ఇది నిజమే అయి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: