టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాకు దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా నుంచి తాజాగా ఆదివారం రోజున టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదిపురుష్ సినిమా నుంచి టీజర్ విడుదల అయింది అన్న ఆనందం అభిమానులకు కొద్దిసేపు కూడా లేకుండా పోయిందట. .


ఎందుకంటే ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తున్నాడు అంటే ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు ప్రేక్షకులు. ఎందుకంటే దర్శకుడు ఓం ఆలోచనలు అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా లేవు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అసలు ఓం రౌత్ తెరకెక్కిస్తోంది రామాయణమేనా అనే అనుమానం కలగక మానదు. టీజర్ లో శ్రీరాముడు ఎక్కడా కనిపించలేదని అంటున్నారట. ఇక రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ లుక్ చాలా దారుణంగా ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనకు తెలిసి ఊహల్లో ఉండే రావణుడు వేరు ఓం రౌత్ చూపించిన రావణుడు వేరు.


  టీజర్ నీ బట్టి చూస్తే హాలీవుడ్ చిత్రాల్లో విలన్ తరహాలో రావణాసురుడిని చూపించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట అభిమానులు. అలాగే ప్రభాస్ సముద్ర వారధి పై నడుచుకుంటూ వచ్చే సీన్ తప్పితే సినిమాలో ఎక్కడా కూడా రామాయణం అన్న భావన కనిపించడం లేదనీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే మొత్తానికి ప్రభాస్ అభిమానులు ఈ టీజర్ పట్ల తీవ్ర నిరాశ చెందుతున్నారట. కాగా టీజర్ లాంచ్ చేసిన తర్వాత ప్రభాస్ బస చేసిన హోటల్లోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ప్రభాస్ కోపంగా ఓం నువ్వు నా రూమ్ కి వస్తున్నావు గా.. రా అంటూ ఆగ్రహంతో పిలుస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారట.. కొందరు రూమ్ లో ఓం రౌత్ కీ ప్రభాస్ క్లాస్ పీకడం ఖాయం అని కామెంట్ చేయగా, ఇంకొందరు సీరియస్ గా వార్ణింగ్ ఇవ్వడానికి ప్రభాస్ రూమ్ కి రమ్మని పిలుస్తున్నాడు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు అన్న చేతిలో నీకు ఉందిపో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: