నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్ హీరోగా పరిచయమైన చిత్రం స్వాతిముత్యం. ఇటీవల ఈ సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక తన మొదటి చిత్రం తోనే గణేష్ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా విజయాన్ని హైదరాబాదు లో సక్సెస్ మీట్ పెట్టి తెలియజేశారు. ఇందులో నటీనటులు మరియు సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయం సాధించడం చాలా ఆనందంగా అనిపించింది అని తెలియజేశారు. అలాగే సినిమా విజయాన్ని కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.


చిరంజీవి నటించిన సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించడం తో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏడాది రెండు సినిమాలు ఒకేసారి విజయవంతం కావడంతో కాస్త ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలియజేశారు. అలాగే హీరో గణేష్ మాట్లాడుతూ.. ముందుగా నేను తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాలి.. ఎందుకంటే హీరోగా తనను అంగీకరించినందుకు సినిమాను సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సినిమాలో తెరపై గణేష్ కనిపించలేదు బాల అనే పాత్రలో మాత్రమే కనిపించి అందరినీ ఆకట్టుకున్నారని తెలియజేశారు. హీరోగా తన మొదటి చిత్రంతోనే 10 మార్కులు వేయించుకున్నారని తెలియజేశారు.


ఈ సినిమాలో అవకాశం రావడం తన అదృష్టమని సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వర్ష భోలమ్మ ఆనందాన్ని తెలియజేసింది. అలాగే మిగతా నటీనటులు సైతం సినిమా సక్సెస్ పట్ల కాస్త ఆనందాన్ని తెలియజేశారు. ఇక ఈ సినిమా మహతి సర్వసాగర్ సంగీతాన్ని అందించారు. ఇందులో ప్రగతి సురేష్ వెన్నెల కిషోర్ సుబ్బరాజు తదితరులు కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ కి కృష్ణ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఏ మేరకు లాభాన్ని అందిస్తుంది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: