ప్రభాస్ హీరోగా ఇప్పుడు భారీ చిత్రాలు సెట్స్ మీ ద ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్ జరుపుకుంటూ ప్రేక్షకులను త్వరలోనే అలరించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక సినిమాను కూడా మొదలు పెట్ట డానికి
ప్రభాస్ రంగం సిద్ధం చేయడం విశేషం. ఇప్పుడు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టుకే
సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొంటున్న
ప్రభాస్ ఈ
సినిమా షె డ్యూల్ కి గ్యాప్ దొరకడంతో మరొక సినిమాను మొదలుపెట్టే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడట.
మారుతి దర్శకత్వంలో ఆయన
సినిమా చేస్తున్నట్లు గా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాన్ని నిజం చేస్తూ ఇటీవలే ఫోటోషూట్ నిర్వహించిన చిత్ర బృందం తాజాగా ఈ
సినిమా నుంచి ఒక అధికారిక ప్రకటన కూడా
వి డుదల చేసే విధంగా రంగం సిద్ధం చేస్తుంది.
దీపావళి కానుకగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ను విడుదల చేయబోతున్నారు. కేవలం
దీపావళి అని మాత్ర మే కాదు
ప్రభాస్ పుట్టిన రోజు కూడా
అక్టోబర్ 23వ తేదీన కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ
మారుతి సినిమా యొక్క ప్రకటనను ఇవ్వబోతున్నాడట.
మాళవిక
మోహన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో
హీరో యిన్లుగా నటిస్తూ ఉండగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను బయటకు వెల్లడించనున్నారు. ఇక
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా
ప్రభాస్ సలార్ అనే సిని మాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నాడు.
బాలీవుడ్ చిత్రం
ఆది పురుస్ చిత్రాన్ని
సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్న ప్ర భాస్ వచ్చే ఏడాదిలోనే ఈ
మారుతి సినిమాను కూడా విడుదల చేయబోతున్నాడు. ఆ విధంగా వచ్చే ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను తన అభిమానులను అలదించబోతున్నాడు.