రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకవైపు వరుస ఫ్లాప్స్ అందుకుంటున్నా తన క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా విజయ్ కి 'అబుదాబీ' నుంచి ఆహ్వానం కూడా అందింది.

మరోవైపు కమర్షియల్ యాడ్స్ లోనూ తెగ అదరగొడుతున్నాడు రౌడీ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కు నాలుగేండ్ల నుంచి ఒక్క హిట్ కూడా పడటం లేదు అని మనం చెప్పవచ్చు కేరీర్ సతమతంగా సాగుతున్నా.. యూత్ లో మాత్రం విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. 'అర్జున్ రెడ్డి'తో రౌడీ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇప్పటికీ కొనసాగుతోంది మరీ

చివరిగా 'లైగర్'మూవీతో విజయ్ భారీ అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఈచిత్రం రిలీజ్ కు ముందుకు ప్రమోషన్స్ లో విజయ్ ఇచ్చిన హైప్, సినిమాకు ఏమాత్రం మ్యాచ్ కాకపోవడంతో ఆడియెన్స్ తోపాటు ఫ్యాన్స్ కూడా  బాగా అప్సెట్ అయ్యారు. మరోవైపు సినిమాపై తీవ్రంగా ట్రోల్స్ రావడంతో విజయ్ కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు.

కానీ, విజయ్ దేవరకొండ సంపాదించుకున్న క్రేజ్ మాత్రం సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉంది మరీ. ఇప్పటికే ప్రముఖ సంస్థ   దక్షిణాదిలో విజయ్ దేవరకొండనే ఎంపిక చేసుకున్నారు. ఈ యాడ్ తోనూ రౌడీ క్రేజ్ మరింతగా పెరిగింది.

'లైగర్' రిలీజ్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ ఇటీవల మరో కమర్షియల్ యాడ్ లోనూ నటించారు. ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ వాచ్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఒక యాడ్  కూడా షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇదీగాక రౌడీ హీరో విజయ్ క్రేజ్ కు మరో గౌరవం దక్కింది.

పూరీ దర్శకత్వం వహించిన 'లైగర్'లో ఎంఎంఏ   ఆర్ట్స్ ఫైటర్ గా విజయ్ అలరించిన విషయం మనకు తెలిసిందే. ఈసందర్భంగా అబుదాబీలో నిర్వహిస్తున్న యూఎఫ్ సీ - ఎంఎంఏ ఛాంపియన్ షిప్ కు అతిథిగా ఆహ్వానం అందుకున్నారు. ఈ మ్యాచ్ కు విజయ్ తో పాటు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్కూడా హాజరయ్యారు.

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ క్రేజ్  పెరుగుతూనే ఉంది మరీ. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తదుపరి చిత్రాలతో మంచి విజయాన్ని సాధిస్తాడని  మనం వేచి చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: