టాలీవుడ్ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ప్రత్యేకంగా నిలిచేలా చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ముఖ్యంగా కౌబాయ్ సినిమాలలో ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ తరహా చిత్రాలకు 1971లో శ్రీకారం చుట్టారు హీరో కృష్ణ. 14 ఇయర్స్ స్టూడియో బ్యానర్ పై జి ఆదిశేషరావు నిర్మాతగా కె ఎస్ ఆర్ దాస్ తెరకెక్కించిన హాలీవుడ్ మూవీ ఫర్ఫ్యూ డాలర్స్ , ద గుడ్ ద బ్యాడ్ తదితర సినిమాల స్ఫూర్తితో కృష్ణ మోసగాళ్లకు మోసగాడు తెలుగులో వచ్చిన మొదటి చిత్రం కౌబాయ్ గా ఒక చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు.ఆ తర్వాత భానుచందర్ సుమన్ కలయికలో మెరుపు దాడి, అర్జున్ కౌబాయ్ నెంబర్ వన్ వంటి సినిమాలు రావడం జరిగింది. కానీ ఆ రేంజ్ లో మెస్మరైజ్ చేయలేకపోయారని చెప్పవచ్చు.అయితే చిరంజీవి నటించిన కొదమ సింహం మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇందులోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులు ఇష్టపడేలా ఉంటాయని చెప్పవచ్చు. ఈ కార్డు తర్వాత కౌబాయ్ పాత్రలో మెరిసిన హీరో ఎవరంటే మహేష్ బాబు.జయంత్ సి పరాంజి ప్రాణం పెట్టి ఈ మూవీ ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో లిరిసా, బీపాషా బసు హీరోయిన్గా నటించింది. ఆ చిత్రమే టక్కరి దొంగసినిమా అప్పట్లో భారీ క్రేజీని అందుకుంది కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా గురించి ఇప్పటికి దర్శక నిర్మాతలు గొప్పగానే చెబుతూ ఉంటారు. ఇక డైరెక్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా తన తెరకెక్కించిన చిత్రాలలో టక్కరి దొంగ ఇప్పటికి తనకి ప్రత్యేకమని తెలియజేస్తున్నారు. సినిమా పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా దర్శకుడుగా తనకు ఒక మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందని తెలిపారు. ప్రేమించుకుందాం రా, లక్ష్మీనరసింహ, ఈశ్వర్, శంకర్ దాదా ఎంబిబిఎస్, తదితర సినిమాలలో గుర్తింపు కంటే టక్కరి దొంగ సినిమాతోనే తనకి గుర్తింపు వచ్చిందని తెలియజేశారు డైరెక్టర్ జయంత్ సి పరాంజి.

మరింత సమాచారం తెలుసుకోండి: