మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దుమ్ము లేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగులో అగ్ర హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా సినిమాలో చేయడం యువ హీరోలకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది మరో రెండు సినిమాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు. వాటికి సంబంధించిన షూటింగ్లను కూడా దాదాపుగా పూర్తి చేశాడు మెగాస్టార్ చిరంజీవి.

అలా సంక్రాంతి కానుకగా బాబీ దర్శకత్వంలో చేసిన వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే తమిళ సినిమా వేదాలం ను తెలుగులో రీమేక్ చేసిన బోలా శంకర్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఆ విధంగా కొద్ది వ్యవధి లోనే ఆయన రెండు సినిమాలను విడుదల చేస్తూ ఉండగా బోళాశంకర్ సినిమాకు సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి భారీ స్థాయిలో పోటీ ఏర్పడడం ఖాయం అని తెలుస్తుంది.

ఆయన హీరోగా తెరకెక్కుతున్న జైలర్ సినిమా యొక్క షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉండగా ఈ సినిమా విడుదల అయ్యే సమయానికి వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఉండడం వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడుతుంది అని చెప్పడానికి కారణం అవుతుంది. దీన్ని బట్టి చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరు అగ్ర హీరోల మధ్య భారీ స్థాయిలో పోటీ ఏర్పడుతుంది అని చెప్పాలి. సంక్రాంతికి బాలయ్యతో పోటీపడుతున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత రజనీకాంత్ తో పోటీ పడుతూ ఉండడం విశేషం.  ఏదేమైనా ఈ పోటీ ఎంతో ఆరోగ్యకరమైంది అని చెప్పాలి. గతంలో వీరు చాలా సార్లు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ల విషయం ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: