ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొంతమంది సెలబ్రిటీలు ఆ సమస్యలతో ఎప్పటినుంచో బాధపడుతున్నప్పటికీ ఆ విషయాన్ని దాచి పెట్టి ఇంటర్వ్యూలలో, ప్రీరిలీజ్ వేడుకలలో ఆ విషయాలలో వెల్లడించి అభిమానులను ఒక్కసారిగా షాక్ కు గురి చేస్తున్నారు.ఇకపోతే బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో కూడా గత ఆరేళ్లుగా ఒక సమస్యతో బాధపడుతున్నప్పటికీ ఆ విషయాన్ని తాజాగా వెల్లడించారు.ఇక  ఆ హీరో ఎవరు? ఆ హీరో ఏ సమస్యతో బాధపడుతున్నారు అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం..

అయితే బాలీవుడ్ స్టార్ హీరో అయిన ఆయుష్మాన్ ఖురానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు ఆయుష్మాన్ ఖురానా.అయితే  ఇది ఇలా ఉంటే తాజాగా ఆయుష్మాన్ ఖురానా ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.కాగా  తాను గత ఆరేళ్లుగా వెర్టిగో అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు.ఇక  సినిమాల షూటింగ్ లు జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సందర్భాలలో ఈ సమస్య తనను ఎంతగానో ఆందోళనకు గురి చేస్తుందని తెలిపారు ఆయుష్మాన్.

ఇకపోతే న్ వెర్టిగో అంటే తలనొప్పి సమస్య. గత ఆరేళ్లుగా ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను అని తెలిపారు ఆయుష్మాన్ ఖురానా.ఇదిలావుంటే ఇక ఆయుష్మాన్ ఖురానా తాజాగా నటించిన చిత్రం ఆన్ యాక్షన్ హీరో. ఈ సినిమాలో ఎత్తైన భవనం నుంచి దూకే సన్నివేశం ఉంటుంది. అయితే  ఇక రక్షణ కోసం హార్నెస్ కేబుల్స్ ఉన్నప్పటికీ ఏదో జరుగుతుందని భయపడిపోయారట ఆయుష్మాన్ ఖురానా. అయితే ఆ భయం బాధలు నరాలు తెగిపోయేలా చేసింది అని తాజాగా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఇకపోతే  ఆన్ యాక్షన్ హీరో అనే సినిమాకు అనిరుద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో పాటు ఆయుష్మాన్ ఖురానా డ్రీమ్ గర్ల్ 2 సినిమాలో కూడా నటించబోతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: