అడివి శేష్  రీసెంట్  గా "మేజర్" సినిమాతో మంచి పాన్  ఇండియా హిట్  అందుకొని పాన్  ఇండియా టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మేజర్  ఉన్ని కృష్ణన్  జీవితం ఆధారంగా తీసిన ఆ చిత్రాన్ని శశి కిరణ్    తిక్కా డైరెక్ట్  చెయ్యగా సోనీ పిక్చర్స్, సూపర్  స్టార్  మహేష్  బాబు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. అయితే ఈరోజు మేజర్ ఉన్ని కృష్ణన్ జ్ఞాపకార్ధం కోసం అడివి శేష్ ముంబైకి వెళ్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ముంబైలోని తాజ్ హోటల్ లో ఉన్ని కృష్ణన్ జ్ఞాపకార్ధ ప్రార్ధన జరగనుంది. అందుకోసం అడివి శేష్  ముంబై వెళుతున్నాడు. సరిగ్గా ఈరోజే ముంబై తాజ్  హోటల్ లో ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఆ దాడుల్లో ప్రజలను రక్షించి మేజర్  ఉన్ని కృష్ణన్  వీర మరణం చెందారు.ఇక అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్  కొలను రూపొందిస్తున్న సినిమా 'హిట్2'. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


మూవీ ట్రైలర్‌ను బుధవారం నాడు లాంచ్ చేశారు.డిసెంబర్‌ 2 వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించారు చిత్రబృందం. ఈ నెల 28న హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా ఈ సినిమా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానుంది.సమాజంలో ఆడవారిపై జరిగే వాస్తవ హత్యల నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఇటీవల సంచలనం సృష్టించిన శ్రద్ధ  వాకర్ హత్య కేసుని ఈ సినిమాలో హైలెట్ చేసినట్లు ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాతో శేష్ ఎలాంటి హిట్టుని అందుకుంటాడో చూడాలి.ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తిగా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్మకంతో వున్నారు. చూడాలి శేష్ ఈసారి ఎలాంటి హిట్ ని అందుకుంటాడో..

మరింత సమాచారం తెలుసుకోండి: