స్టార్ కిడ్ శృతి హాసన్ లైఫ్ స్టైల్ ఈ జనరేషన్ ది కాదు. ఆమెది అంతా పాశ్చాత్య సంస్కృతి. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా తమ లవర్ ని పరిచయం చేయడానికి, రిలేషన్ పై ఓపెన్ కావడానికి భయపడతారు.
కానీ శృతి బహిరంగంగా ఎఫైర్స్ నడుపుతుంది. నచ్చినవాడితో ఉంటే తప్పేంటి అంటుంది. రెండేళ్ల కాలంగా శృతి ముంబైలో ఉంటున్నారు. శాంతను హజారిక అనే డూడుల్ ఆర్టిస్ట్ తో ఆమె లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఓకే ఇంట్లో ఉంటున్నారు.

శాంతను హజారికతో సన్నిహితంగా దిగిన ఫోటోలు శృతి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఎలాంటి దాపరికం లేకుండా తన ప్రేమ కహానీ గురించి ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. అయితే శృతి ప్రియుడు శాంతను హజారికతో విడిపోయారనే వార్త తెరపైకి వచ్చింది. శృతి లవ్ బ్రేకప్ అయ్యారంటూ కథనాలు వెలువడుతున్నాయి. శృతి ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఈ ఊహాగానాలకు కారణమైంది.

శృతి ఇంస్టాగ్రామ్ లో 'చివరకు నాకు అర్థమైంది ఏందంటే… నాతో నేను ఉండటం సంతోషం ఇస్తుంది. నా ఒంటరి తనాన్ని, నా సమయాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడి వరకు రావడం వెనుక దేవుని దయ ఉంది. ఆయనకు కృతజ్ఞతలు…' అని కామెంట్ చేశారు. ఒంటరి తనాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పడం వెనుక శృతి ఆంతర్యం ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి. నాకు నేనే తోడుగా ఉండటమే మంచిదని తెలుసుకున్నాను అని శృతి చెప్పడానికి కారణం బ్రేకప్పే అంటున్నారు.

కాగా ఈ వార్తలపై శృతి స్పందించాల్సి ఉంది. శృతి గతంలో మైఖేల్ కోర్ల్సే అనే లండన్ వ్యక్తితో ప్రేమాయణం నడిపారు. 2019లో మైఖేల్ కి శృతి బ్రేకప్ చెప్పారు. అలాగే కెరీర్ బిగినింగ్ లో సిద్ధార్థ్, ధనుష్ లతో శృతి ఎఫైర్స్ నడిపారనే పుకార్లు ఉన్నాయి. ఇక శృతి కెరీర్ గాడిన పడింది. శృతి నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదలవుతున్నాయి. అలాగే ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం సలార్ లో శృతి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ బోల్డ్ బ్యూటీ పెళ్లి అంటే భయం అనడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: