టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని తాజాగా ది వారియర్ అనే పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కెరియర్ లో మొట్ట మొదటి సారి రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. దానితో ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమాపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు మరియు తమిళ భాషలలో థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ లభించలేదు. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా భారీ మొత్తంలో రాలేదు  దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ఇలా తెలుగు మరియు తమిళ సినీ ప్రేమికులను పెద్దగా అలరించ లేక పోయిన ఈ మూవీ హిందీ సినీ ప్రేమికులను మాత్రం ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో అందిస్తుంది.

మూవీ హిందీ వెర్షన్ ను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. ఈ మూవీ ని యూట్యూబ్ లో విడుదల చేసిన అతి తక్కువ రోజుల్లోనే యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ లకు పైగా వ్యూస్ ను సాధించింది. ఇప్పటికి కూడా ఈ మూవీ హిందీ వర్షన్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ,  లింగుసామీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: