ఇక నారా లోకేష్ శుక్రవారం నాడు మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి తారకరత్న స్పృహతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. కుప్పం దగ్గరలోని ఓ మసీదులో లోకేష్‏తోపాటు..బాలకృష్ణ ఇంకా తారకరత్న ప్రార్ధనలు చేశారు. అదే సమయంలో ఒక్కసారిగా అభిమానులు అక్కడికి తోసుకుని రావడంతో..ఆయన అక్కడే ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ హాస్పటల్‌కు కూడా తీసుకెళ్లారు. శుక్రవారం నాడు అర్దరాత్రి ఆయనను బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇక శనివారం నాడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు నారాయణ హృదయాలయ వైద్యులు. ఇంకా ఆయన ఆరోగ్యం చాలా విషమంగానే ఉందని.. పది మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన్ని పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలియడం వల్ల అటు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు..అభిమానులు ఇంకా అలాగే టీడీపీ కార్యకర్తలలో ఆందోళన చాలా ఎక్కువైంది. ఇక అందుకే తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన చెందుతుంటే తన ప్రమోషన్లను ఆపేశారు హీరో కళ్యాణ్ రామ్.ఆయన నటిస్తోన్న అమిగోస్ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్ధమవుతుంది.


దీంతో కొద్ది రోజులుగా ప్రమోషన్స్ స్పీడ్ ని పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు సాయంత్రం ఈ సినిమా నుంచి ఎన్నో రాత్రులోస్తాయి గానీ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ఫుల్ సాంగ్ వీడియోను జనవరి 29 వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కానీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగా లేనందువలన ఈ పాట విడుదలను వాయిదా వేస్తున్నామని.. సోమవారం నాడు ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నామని.. తారకరత్న గారు త్వరగా కోలుకోవాలంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఒక ప్రకటనని విడుదల చేశారు.అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నిన్నటి నుంచి బాలకృష్ణ, చంద్రబాబు ఇంకా గోరంట్ల సుబ్బయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు. శుక్రవారం నాడు రాత్రి తారకరత్న భార్య ఇంకా ఆయన కూతురు ఆసుపత్రికి చేరుకున్నారు.అలాగే సోదరుడి ఆరోగ్య పరిస్థితి గురించి తన బాబాయ్ బాలయ్యకు కాల్ చేసి తెలుసుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఎప్పటికప్పుడు డాక్టర్స్ ఇంకా బాలకృష్ణతో మాట్లాడుతూ హెల్త్ అప్డేట్ తెలుసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: