పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాలతో కూడా చాలా బిజీగా ఉన్నారు. పవన్ కు పుస్తకాలు అంటే ఎంతో ఇష్టం అనే విషయం తెలిసిందే.పవన్ తన రియల్ లైఫ్ లో ఎన్నో వేల పుస్తకాలను అయితే చదివారు. పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన పుస్తకాలలో చదివిన విషయాల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే ఆర్జీవీ పవన్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు అయితే చేశారు.

రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు ఒక సవాల్ విసిరారు. 20 పుస్తకాల పేర్లు చెప్పగలవా అంటూ వర్మ ఛాలెంజ్ విసరగా ఈ ఛాలెంజ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరి చూడాలి. పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివానని చెబుతారని ఆ 2 లక్షల పుస్తకాల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదని  కనీసం 20 పుస్తకాల పేర్లు చెబితే చాలకూడా ని వర్మ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

పవన్ సెకనుకి ఒక మాట మాట్లాడతారని రాజకీయంగా పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో స్పష్టత లేదని కూడా వర్మ పేర్కొన్నారు. పవన్ ఎప్పుడూ చేగువేరా గురించి మాట్లాడతారని చేగువేరా కమ్యూనిస్ట్ అని ఆర్జీవీ చెప్పారు.. చేగువేరను చిన్న వయస్సులో నే చంపేశారని ఆయన అక్కడ చేసిందేం కూడా ఏమి లేదని ఆర్జీవీ వెల్లడించడం విశేషం.. పవన్ 18 సంవత్సరాల వయస్సులో చేగువేరాకు ఫ్యాన్ అయ్యాడని ఆ సమయానికి పవన్ కు చేగువేరా గురించి అస్సలు ఏం తెలియదని కూడా ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

ఇక్కడి మావోయిస్ట్ నేతల గురించి పవన్ కొన్ని మాటలు మాట్లాడాలని ఆర్జీవీ కామెంట్లు చేశారు. పవన్ కు ఈ విషయాలు అస్సలు తెలుసో తెలియదో మరి అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఆర్జీవీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: