మంచు మోహన్ బాబు.. నట వారసులుగా ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో మంచు మనోజ్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ అందరిలా స్టార్ ట్యాగ్ మాత్రం పొందలేకపోయాడు అని చెప్పాలి. ఇక ఎన్ని ప్రయత్నాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఎందుకో కమర్షియల్ గా మాత్రం అతని సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే గత కొన్నెళ్ల నుంచి మాత్రం మనోజ్ సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మంచు మనోజ్ ఇక ఇటీవలే రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అయితే ఎన్నో రోజుల నుంచి మంచచు కుటుంబం భూమా కుటుంబం కలవబోతోంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎవరు దీనిపై స్పందించలేదు. దివంగత రాజకీయ నాయకుడు భూమ నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డితో మంచు మనోజ్ సహజీవనం చేస్తున్నాడంటూ వార్తలు వచ్చిన మంచు వారి కుటుంబం నుంచి ఎవరు కూడా ఈ విషయంపై నోరు విప్పలేదు. త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు మంచు మనోజ్ చెప్పాడు. ఇలా చెప్పిన కొన్ని రోజులకే భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే మంచు మనోజ్ మౌనిక రెడ్డి వివాహం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో వీరిద్దరికి కూడా విడివిడిగా వివాహం జరిగింది. 2015లో మనోజ్ రెడ్డిని  ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకుంటే మౌనిక రెడ్డి.. గణేష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే మౌనిక రెడ్డి వివాహానికి మంచు మనోజ్ స్పెషల్ గెస్ట్ గా వెళ్ళాడు. కట్ చేస్తే ఇక ఇప్పుడు ఏకంగా మౌనిక రెడ్డి భర్తగా మారిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మౌనిక రెడ్డి పెళ్లికి మనోజ్ హాజరైన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: