టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కి వచ్చిన చాలా సంవత్సరాలకి హిట్ కొట్టిన దర్శకులలో విక్రమ్ కే కుమార్ ఒకరు.ఈయన చేసిన సినిమాల్లో ఇష్క్,మనం సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.ఇక తరువాత సూర్య హీరోగా 24 అనే మూవీని కూడా తీశారు ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

ఐతే ఇక ఆ తరువాత అఖిల్ తో హలో అనే సినిమా తీశాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా వర్క్ అవుట్ కాలేదు దాంతో తన నెక్స్ట్ సినిమా నాని హీరోగా గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేశాడు.ఇది యావరేజ్ గా ఆడింది దీంతో తన తరువాత సినిమా గా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా బీవీఎస్ రవి ఇచ్చిన కథ తో థాంక్యూ అనే మూవీ చేసాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.ఇక దాంతో ఇప్పుడు ఎం సినిమా చేయాలి ఆని డైలమాలో పడిపోయిన ఆయనకి నాగార్జున పిలిచి మరి ఛాన్స్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది ప్రస్తుతం నాగార్జున రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమా తరువాత నాగార్జున విక్రమ్ డైరెక్షన్ లో నటించే అవకాశాలు ఉన్నాయి.

ఆయన వాళ్ల ఫ్యామిలీకి మనం అనే ఒక మంచి హిట్ సినిమా ఇచ్చాడు కాబట్టే నాగార్జున కి విక్రమ్ మీద ఎప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుందని దాని కారణం గానే తనకు మళ్ళీ సినిమా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఈ సినిమా తో అయిన విక్రమ్ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి. నాగార్జున ఎప్పుడైనా తను నమ్మిన డైరెక్టర్స్ కి ఛాన్స్ లు ఇస్తు వస్తుంటాడు ఒక్కసారి ఆ డైరెక్టర్ మంచి సినిమా చేయగలడు అని అనిపిస్తే చాలు ఎది ఆలోచించకుండా అవకాశాలు ఇస్తు ఉంటాడు.

ఆ విధంగా నాగార్జున మొదటినుండి తనకు నచ్చిన డైరెక్టర్ కి స్టోరీ లైన్ ఎలాగున్నా ఆయన మీద ఉన్నా ఒపీనియన్ తో ఆయనకి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన అభిమానులు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: