మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించు కున్నాడు . అలాగే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ ఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు .

మూవీ ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ లో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ "ఆర్ సి 15" అని వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణను జరుపుకుంటుంది.

మూవీ కి ఇప్పటి వరకు టైటిల్ ను ప్రకటించాలని నేపథ్యంలో ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ టైటిల్ టీజర్ ను మూవీ  యూనిట్ లాక్ చేసినట్లు కూడా సమాచారం. ఈ టైటిల్ టీజర్ 45 సెకండ్ ల నిడివి తో ఉండబోతున్నట్లు ... ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండే విధంగా చిత్ర బృందం రూపొందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: