తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న కాంబినేషన్ లో బాలయ్య ... బోయపాటి కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్ లో మొదటగా సింహం మూవీ రూపొందింది. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత లెజెండ్ మూవీ వీరి కాంబినేషన్ లో రూపొందింది. ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగవ మూవీ కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది అంటూ అనేక వార్తలు అనేక రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మరొకసారి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... బాలయ్య ... బోయపాటి కాంబినేషన్ లో రూపొందబోయే నాలుగవ సినిమా జూన్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ అఖండ మూవీ కి సీక్వెల్ గా రూపొందబోతుందా ... లేదా కొత్త కథతో రూపొందబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తూ ఉండగా ... బోయపాటి శ్రీను ... రామ్ పోతినేని హీరో గా రూపొందుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: