ప్రస్థుత పరిస్థితులలో ఒక యంగ్ డైరెక్టర్ ను నమ్మి టాప్ హీరోలు సినిమాను చేయడానికి భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితులలో భారీ సినిమాలు తీయడంలో ఏమాత్రం అనుభవం లేని శ్రీకాంత్ ఓదెల ను నమ్ముకుని నాని ‘దసరా’ తో చేస్తున్న సాహస ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయమై తలలు పండిన ఇండస్ట్రీ వర్గాలకు కూడ అంచనాలు అందడం లేదు.


శ్రీరామనమి రోజున పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీ హిట్ టాక్ తెచ్చుకుని 100 కోట్ల నెట్ కలక్షన్స్ తెచ్చుకుంటే తప్ప ఈమూవీ బయ్యర్లు గట్టెక్కరు అని అంటున్నారు. శ్రీకాంత్ తండ్రి సింగరేణి లో ఒక ఉద్యోగం చేసేవాడట. మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీకాంత్ సింగరేణి బొగ్గుగనుల కార్మికుల జీవితాలను చాల దగ్గరగా చూసిన అనుభవం ఉంది.


ఆ అనుభవంతోనే ‘దసరా’ ను తీసాడు. సుకుమార్ శిష్యుడుగా కొన్ని సినిమాలకు పనిచేసిన అనుభవం తప్ప శ్రీకాంత్ కు ఎటువంటి గాడ్ ఫాదర్ లు లేరు. అయితే నాని ‘దసరా’ విషయంలో శ్రీకాంత్ ను పూర్తిగా నమ్మి ఆసినిమాను చేసాడు అని అంటారు. ఈసినిమా కథలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటించింది. అయితే శ్రీకాంత్ ఆపాత్రను వ్రాసుకుంటున్నప్పుడు అతడి మనసులో కొందరు ప్రముఖ హీరోయిన్స్ పేర్లు వచ్చాయట.

నాని మాత్రం వెన్నెల పాత్రకు కీర్తి సురేష్ మాత్రమే సరిపోతుంది అని చెప్పగానే శ్రీకాంత్ ఆమె వద్దు అంటూ అనేకసార్లు నాని తో వాదించాడట. అయితే నాని బలవంత పెట్టి ఈమూవీ ప్రాజెక్ట్ లో కీర్తిని తెచ్చిన విషయాన్ని కుర్తుకు చేసుకున్నాడు. ఆమె షూటింగ్ లోకి వచ్చి స్పాట్ లో నటించడం మొదలుపెట్టిన తరువాత వెన్నెల పాత్ర కీర్తి తప్ప మరెవ్వరూ చేయలేరని తనకు అనిపించిన విషయాన్ని ఇప్పుడు బయటపెడుతూ భవిష్యత్ లో తాను ఏకథ వ్రాసినా ముందు కీర్తికి వినిపించి ఆమె నో అన్న తరువాత మాత్రమే మరో హీరోయిన్ వైపుకు వెళతాను అని అంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్..

మరింత సమాచారం తెలుసుకోండి: