
నిన్నటి రోజున సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర బృందం. ట్రైలర్లు చూస్తే రవితేజ పలు విభిన్నమైన పాత్రలు పోషించినట్లుగా కనిపిస్తోంది. తన కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తూ ఉండడంతో గతంలో రవితేజ నటించిన కిక్ సినిమా చిత్రాన్ని గుర్తు చేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు అలాగే ఉన్నట్టుగా సమాచారం మరి సినిమా కూడా కిక్ లాగానే మంచి విజయాన్ని అందుకుంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
కిక్ సినిమా గతంలో కూడా మొదట నెగిటివ్ టాకు తెచ్చుకొని ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. రావణాసుర చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు ఇందులో అను ఇమ్మానియేల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ నటించారు. వీరందరూ చుట్టూ జరిగే కొన్ని ఎలివేషన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. కీలకమైన పాత్రలో రావు రమేష్ సుశాంత్ విలన్ లాగా నటించారు. రావణాసుర సినిమా ట్రైలర్ చూస్తే యాక్షన్ కామెడీ క్రైమ్ ఇలా అన్నీ కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి రవితేజ అభిమానుల కోరుకొని అన్ని అంశాలు రావణాసుర చిత్రంలో ఉండనున్నట్లు ఈ ట్రైలర్ను చూస్తే మనకి తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆడాల్సిందే.