
ఇక ఎన్.టి.ఆర్ తో యువసుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి చేస్తున్న కొరటాల శివ మూవీ కూడా బడ్జెట్ భారీగానే ఉంటుందని టాక్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 300 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నారట. అంటే అందులో హీరోకే దాదాపు 60 నుంచి 70 కోట్ల దాకా డైరెక్టర్ కి పాతిక కోట్ల దాకా అంటే ఇలా రెమ్యునరేషన్స్ కోసమే 120 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట. ఇక మిగతాది ప్రొడక్షన్ కాస్ట్ అని తెలుస్తుంది.
చరణ్ సినిమాకు కూడా 250 కోట్లు భారీగా పెట్టేస్తున్నారట. శంకర్ ఈ సినిమాలో ఒక సాంగ్ కోసమే దాదాపు 20 కోట్ల దాకా ఖర్హు పెట్టించాడని తెలుస్తుంది. సో మొత్తానికి ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత 250 కోట్లతో చరణ్, 300 కోట్లతో ఎన్.టి.ఆర్ ఇద్దరు ఎక్కడ తగ్గట్లేదని చెప్పొచ్చు. ఈ సినిమాలే కాదు వారు నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఇదే రేంజ్ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాలుగా ప్లాన్ చేస్తున్నారు. చరణ్ నెక్స్ట్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తుండగా.. ఎన్.టి.ఆర్ 31 ప్రశాంత్ నీల్ తో లైన్ లో ఉంది.