పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాలు తీయాలంటే.. ఆ సినిమాల కోసం ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న టెక్నీషియన్లు కావాలంటూ గత కొన్నేళ్లుగా మనవాళ్లు ఇదే పని చేస్తుంటారు.సినిమా నటీనటులు మన దగ్గర నుండి, టెక్నీషియన్లు దాకా ఎక్కువగా విదేశాల నుండి వస్తుంటారు. అయితే లాజిక్‌ సరిగ్గా వర్కవుట్ అవ్వకపోతే మాత్రం నష్టం కూడా చాలా భారీగా ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలా సినిమాలు కూడా ఇలా ఇబ్బంది పడ్డాయి. అయితే రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ విషయంలో ఈ ఫార్ములా బ్రేక్ అవ్వొచ్చు.ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌  30వ సినిమా కోసం ఇటీవల ముహూర్తం జరిగింది. ఆ తరువాత ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలుపెట్టేశారు. భారీ ఎత్తున ఫేక్‌ బ్లడ్‌, ఆయుధాలు ఇంకా మసి.. ఇలా ఓ రాక్షస వాతావరణం సృష్టించి సినిమాని తీస్తున్నారు. ఇదంతా మాస్‌ యాంగిల్‌ అనుకుంటే, ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ నుండి టెక్నీషియన్లు పిలిపించి మరీ పని చేస్తున్నారు.


దర్శకుడు కొరటాల శివ ఆచార్య వల్ల తనకి జరిగిన అవమానం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ తో ఎలా అయినా ఇప్పుడు భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలానే కసి మీద వున్నాడు.. అందుకే ఎన్టీఆర్‌ కొత్త సినిమా కోసం హాలీవుడ్‌ నిపుణులని లైన్ లో పెట్టాడు.ముఖ్యంగా ఈ సినిమా VFX విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కొరటాల. ఈ సినిమాని ఒక కమర్షియల్ సినిమా లాగా మాత్రమే కాకుండా ఓ విజువల్ వండర్ లాగా తీర్చి దిద్దాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాకి VFX సూపర్ వైజర్‌గా హాలీవుడ్ టెక్నిషియన్ బ్రాడ్ మిన్నిచ్‌ను రప్పించి పనులు మొదలుపెట్టారు. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండే ఈ సినిమాలో... గ్రాఫిక్ వర్క్ కోసం అతను వచ్చాడు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా కెన్నీ బేట్స్‌ను రీసెంట్ గా టీమ్‌లోకి తీసుకున్నారు. అయితే వీళ్లంతా సినిమాల కోసం భారీగా డబ్బులు వసూలు చేసేవాళ్లే. 'ఆచార్య' సినిమా విషయంలో ఇలాంటి ఖర్చు ఇబ్బందులు ఎదుర్కొన్న కొరటాల.. ఈ సారి జాగ్రత్త పడి సినిమాని బాగా తీయాలనీ కోరుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: