ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా తమ సినిమాలను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే 4 సినిమాల చిత్ర బృందాలు ప్రకటించాయి. ఆ సినిమాలు ఏవో ప్రస్తుతం తెలుసుకుందాం. మా నగరం మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఖైదీ ... మాస్టర్ ... విక్రమ్ మూవీ లతో కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయిన లోకేష్ కనకరాజు ప్రస్తుతం లియో అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటు వంటి బోయపాటి శ్రీను ... రామ్ పోతినేని హీరోగా ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ.ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ జు ఫిక్స్ చేయలేదు.

 దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను బోయపాటి రాపో అనే టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీకి ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ పొందుతున్న సందర్భంగా ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఎన్ బి కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర బృంద పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేరినట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఈ మూవీ యూనిట్ ప్రకటించలేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: