మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం ధమాకా మూవీ తో సోలో హీరో గా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న వాల్టేరు వీరయ్య మూవీ లో రవితేజ కీలకమైన పాత్రలో నటించి మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. బాబీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరస విజయలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. 

సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఫరియా అబ్దుల్లా , దక్ష నాగర్కర్ , మెగా ఆకాష్ , అను ఇమాన్యుల్ , పూజిత పొన్నడా హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిటీ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ 141 నిమిషాల 56 సెకండ్ ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: