ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగకు దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఎక్కువ శాతం విడుదల అవుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కూడా ఇదే వాతావరణం కనిపించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతి తమ సినిమాలను విడుదల చేయనున్నట్లు కొన్ని చిత్ర బృందాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి.

చాలా రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనం అందరికీ తెలిసిందే.

 ఈ మూవీ చిత్రీకరణ "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించనుండగా ... మైత్రి సంస్థ ఈ మూవీ ని నిర్మించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: