తమిళ మూవీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్రిషమూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది.

మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోకు ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ఏప్రిల్ 6 వ తేదీ నుండి చెన్నై లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని రెండవ షెడ్యూల్ షూటింగ్ లో ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న నటీనటులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ లోని కీలక నటీ నటులపై అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించే విధంగా ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీపై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: