
అయితే తాజాగా ఈయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరులోని క్లబ్ హోటల్లో అతడు సూసైడ్ చేసుకున్నట్లుగా ఒక వీడియోలో తెలియజేస్తూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే కారణం అన్నట్లుగా తను ఆ వీడియోలో తెలియజేశారు. ఆత్మహత్యకు ముందు చైతన్య ఒక సెల్ఫీ వీడియోని రికార్డు చేశారు. ఆ వీడియోలో తెలిపిన ప్రకారం తన తల్లిదండ్రులకు తన తోటి డాన్స్ మాస్టర్లకు డాన్సర్లకు సారీ చెప్పారు తట్టుకోలేకపోతున్నానని వాటిని తీర్చడానికి ఎంతో ట్రై చేసిన అది అవ్వడం లేదని తెలియజేశారు. అప్పు పూడ్చేందుకు మరొక తప్పు అలా అప్పులు చాలా పెరిగిపోయాయి అని కూడా తెలియజేయడం జరిగింది.
నేమ్ ఫేమ్ ఇచ్చిన ఢీ షోకు మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేశారు. డి ప్రోగ్రాం లో కేవలం పేరు మాత్రమే వచ్చింది కానీ సంపాదన తక్కువగా ఇస్తున్నారని జబర్దస్త్ ప్రోగ్రాంలో ఎక్కువగా మనీ ఇస్తున్నారని తన సెల్ఫీ వీడియోలో తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.శనివారం రోజున నెల్లూరులో కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో చైతన్యకు సన్మానం జరిగిందట ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ చైతన్యను సన్మానించారు. ఈ కొరియోగ్రాఫర్ మరణం అందరికీ ఆ షాక్ అయ్యేలా చేస్తోంది.