
ఈ సినిమాలో శృతిహాసన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాదు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. 2014 జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 45 కోట్లకు పైచిలుకు కలెక్షన్ సాధించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక బిగ్ మిస్టేక్ ఉందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ పాత్రలు చనిపోతాయి అన్న సంగతి తెలిసిందే. ఇక రౌడీల దాడిలో అల్లు అర్జున్ ముఖం కాలితే రామ్ చరణ్ తల్లి డాక్టర్ కావడంతో అతని ముఖాన్ని అల్లు అర్జున్ కు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అమరుస్తుంది. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మారేది ముఖం మాత్రమే. కానీ ఈ సినిమాలో మాత్రం ముఖంతో పాటు వాయిస్ కూడా మారిపోయి రామ్ చరణ్ వాయిస్ వస్తుంది. ఈ విషయంలోనే దర్శకుడు పప్పులో కాలేశాడు. ఈ విషయంపై దర్శకుడు కాస్త ఆలోచించి ఉండే ఈ మిస్టేక్ జరిగేది కాదని కొంతమంది సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ బిగ్ మిస్టేక్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.