హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ధమాకా తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ.. మొన్నటికి మొన్న రావణాసుర అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ దొంగగా కొనసాగిన నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దొంగాట ఫేమ్ వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అని చెప్పాలి. అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా.. ఇటీవల రాజమహేంద్రవరంలోని గోదావరి వంతెన పై రవితేజ అభిమానుల సమక్షంలో ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు చిత్రబృందం. ఈ క్రమంలోనే అక్కడికి విచ్చేసిన రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు దర్శకుడు వంశీ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఈ సినిమా ద్వారా ఏం చూపించబోతున్నారు అని ప్రశ్నించగా.. చాలామంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల బయోపిక్ లు తీస్తారు. నేను నెగిటివ్ ఛాయలు ఉన్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తీస్తున్నాను. ఆయన గురించి చాలామందికి తెలుసు. ఆయన చనిపోయాడని తెలిసి భౌతికకాయాన్ని చూసేందుకు మూడు లక్షల మంది వెళ్లారు అని నేను చేసిన రీసెర్చ్ లో తెలుసుకున్నా..


 దీంతో ఆయన జీవితంలో బయటపడని నిజం ఏదో ఉంది అని నాకు అర్థమైంది.  దీంతో ఇక ఆ నిజాన్ని అందరికీ చెప్పేందుకే ఈ సినిమా తీస్తున్న అంటూ డైరెక్టర్ వంశీ చెప్పుకొచ్చాడు. అయితే ముందుగా  వేరొకరితో చేయాలని అనుకున్నప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో రవితేజతో తీస్తున్నాను. ఇక టైగర్ నాగేశ్వరరావు పుట్టింది ఇక్కడే అయినప్పటికీ అన్ని ప్రాంతాల వారికి సహాయం చేశారు. అందుకే ఆయన గురించి అన్ని ప్రాంతాల వరకు తెలియాలని ఉద్దేశంతోనే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం అంటూ తెలిపాడు డైరెక్టర్ వంశీ.

మరింత సమాచారం తెలుసుకోండి: