తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా డాక్టర్ నిహారికకు ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు. మొదట యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చి సక్సెస్ కాలేకపోయింది. ఇక తర్వాత సిద్దు జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి మరి వివాహం చేసుకున్న నిహారిక గత కొద్ది రోజుల నుంచి విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జొన్నలగడ్డ చైతన్య పరోక్షంగా మెగా డాటర్ నిహారికతో విడాకులను కన్ఫామ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి.


రీసెంట్గా జొన్నలగడ్డ చైతన్య కుటుంబం తిరుమల తిరుపతి దేవాలయాన్ని సందర్శించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు అక్కడ కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుకున్నారు.. ఒకవేళ నిజంగా వీళ్ళు విడాకులు తీసుకొని పక్షంలో ఇదంతా రూమర్స్ నమ్మవద్దు అని చెప్పేవారు.. కానీ చైతన్య అలా చెప్పలేదు. ఈ క్రమంలోనే పరోక్షంగా చైతన్య నిహారిక విడాకులు కన్ఫామ్ చేశారంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


నిహారిక సైతం డెత్ పిక్సెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడా కూడా తన భర్త చైతన్య గురించి మాట్లాడడం కానీ అందుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు కానీ తెలియజేయలేదు. ముఖ్యంగా విడాకులు తీసుకోవట్లేదు అంటూ కూడా క్లారిటీ ఇవ్వలేదు నిహారిక..ఈ క్రమంలోనే రీసెంట్ గా చైతన్య పరోక్షంగా ఇచ్చిన ఆన్సర్ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. మరి ఏ మేరకు అధికారికంగా ఈ విషయంపై కుటుంబ సభ్యులు సైతం ఫుల్ క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. నిహారిక ఈ మధ్యకాలంలో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది . ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించినట్లు అందులో పలు చిత్రాలను తెరకెక్కించబోతున్నట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: