హీరోయిన్ గా మంచి ఫామ్ లో కి వస్తున్న టైమ్ లో ఒక ఇండస్ట్రీని వదిలిపెట్టేసింది హీరోయిన్ సోనమ్ బజ్వా. తన అందాలతో బాలీవుడ్ లో అద్భుతం  చేసిన  బ్యూటీ.. పంజాబీ సినిమాలకే పరిమితం అయ్యింది. బాలీవుడ్ తో పాటు.. తెలుగు, తమిళ, సినిమాల్లో కూడా నటించి మెప్పించింది స్టార్ బ్యూటీ సోనమ్ బజ్వా. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు హీటు పుట్టించిన ఈ బ్యూటీ. ప్రస్తుతం ఎక్కువగా పంజాబి సినిమాలు చేసుకుంటూ.. బాలీవుడ్ ను అసలుకే వదిలేసింది. ఇక సౌత్ లో కూడా పెద్దగా కనిపించడం లేదు బ్యూటీ.

తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన బాబు బంగారం సినిమాలో ఓ సాంగ్ లో మెరిసిన బ్యూటీ.. సుశాంత్ హీరోగా వచ్చిన ఆటాడుకుందాం రా సినిమాలో నటించింది. ఈరెండు సినిమాలు హిట్ అవ్వకపోయే సరికి.. తమిళంలో ట్రై చేసి.. ఇక సౌత్ ముఖం కూడా చూడలేదు బ్యూటీ. ఇకబాలీవుడ్ లో అయినా కుదురుగా ఉందా అంటే.. అక్కడ కూడా నిలవలేదు సోనమ్ కాలు. వెంటనే పంజాబ్ కు షిష్ట్ అయ్యింది.

హిందీలో కూడా కేవలం రెండు సినిమాలు మాత్రమే అయ్యింది బ్యూటీ.. ఈ రెండు సినిమాల తర్వాత కూడా ఆమెకు హిందీలో చాలా అవకాశాలు వచ్చాయి. కాని సోనమ్ బాలీవుడ్ సినిమాలు చేయడానికి భయపడింది. అయితే ఈమె ఇలా భయపడటానికి ఓ కారణం కూడా ఉంది. చాలా వరకు హిందీ సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్లు ఉంటాయి. అయితే ఇలా  ముద్దు సీన్లలో నటించటం సోనమ్ కు  నచ్చలేదు. అందుకే వచ్చిన అవకాశాలను వద్దనుకున్నారు.

అయితే ఇలా ముద్దు సీన్లలో నటించటం ద్వారా ఆమె తన కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న కారణంతో ఆమె తన అవకాశాలను వదులుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో ఆమె ఆమె మాట్లాడుతూ.. నా సినిమాలు నా ఫ్యామిలీ చూస్తుందన్న స్ప్రహ ఉంది. అందుకే నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ముద్దు సీన్లలో నటించడానికి చాలా భయపడేదాన్ని.

దాన్ని నా వాళ్లు ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. నా కుటుంబం దాన్ని ఓ సినిమా మాత్రమే అని అర్థం చేసుకోగలదా? ఇలాంటి చాలా ప్రశ్నలు నా బుర్రలో ఉండేవి. అందుకే చాలా హిందీ సినిమాలు వదలుకున్నాను అని అన్నారు సోనమ్. ఇక  సోనమ్‌ బజ్వా 2013లో వచ్చిన బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అనే పంజాబీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ప్రస్తుతం పంజాబీ సినిమాలకు.. అది కూడా పద్దతిగా ఉన్న సినిమాలకు మాత్రమే ఆమె పనిచేస్తున్నారు. ఇక ఆమె హీరోయిన్‌గా నటించిన ‘కప్పల్‌’ అనే తమిళ కామెడీ సినిమా తెలుగులో పాండవుల్లో ఒకడుగా డబ్‌ అయి రిలీజైంది. ప్రస్తుతం పంజాబ్ లో స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది సోనమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: