పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టార్ సినిమా బ్రో. ఇక ఈ సినిమా షూటింగ్ ని పవన్ కళ్యాణ్ శరవేగంగా పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లిన బ్రో జూలై 28న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అంటే ఆరు నెలల లోపే షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ ఇంత వేగంగా ఇప్పటివరకు ఏ సినిమాని కంప్లీట్ చేయలేదు పవన్. ఇక తమిళ హిట్ వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. 

త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించగా ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ ఐటెం సాంగ్ కి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్లో పబ్ సెట్ ఏర్పాటు చేశారట .ఇక ఆ సెట్ లో ఐటెం సాంగ్ ను షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలోని ఆ ఐటమ్ సాంగ్ లో ఊర్వశి రౌటెల నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో కలిసి ఆ ఐటెం సాంగ్ కి స్టెప్పులు వేయబోతోందట ఈ చిన్నది. అయితే ఈ క్రమంలోనే మరొక

 ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఊర్వశి సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయిన వాళ్ళు సినిమాలో చిరంజీవి సరసన చిందులేసిన సంగతి మనందరికి తెలిసిందే. బాస్ పార్టీ సాంగ్ ఈ సినిమాకు మంచి హైప్ ను తెచ్చింది. ఇక అన్నయ్యతో చిందులేసిన ఈ చిన్నది ఇప్పుడు తమ్ముడితో కూడా డాన్స్ చేయబోతోంది. దీంతో మెగా ఫాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఒకే హీరోయిన్ అన్న మరియు తమ్ముళ్ళతో స్టెప్పులెస్తుంటే చూసి ఆనందిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇదిలా ఉంటే మరోవైపు పవన్ కళ్యాణ్ ఓ జి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరొక సినిమా అయినటువంటి హరిహర వీరమల్లు సినిమాని మాత్రం పక్కన పెట్టేసాడు పవన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: