టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.తన మూడవ భార్య అయిన రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చేందుకు నరేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆమె మాత్రం విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కానీ నరేష్ మాత్రం కచ్చితంగా ఆమె నుండి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే వారిద్దరికీ విడాకులు కూడా మంజూరు అవుతాయని అంటున్నారు.ఇక నరేష్  పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి ప్రేమ మొదలై చాలా కాలం అవుతుంది. చాలా దూరం వెళ్ళింది కూడా. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇక ఒక సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు సహజీవనం చేసే వరకు వచ్చింది. ఇక వీరిద్దరూ జంటగా కలిసి ఇటీవల మళ్ళీ పెళ్లి అనే సినిమాను తమ సొంత కథని తీసుకొని చేసిన సంగతి ఏమనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ సినిమా వివాదాస్పదంగా మారి ఈ జంట గురించి కొన్ని నిజాలు బయటికి వచ్చాయి. ఈ సినిమాతో వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మరియు వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఈ సినిమాతో బయటికి వచ్చింది.

ఈ మధ్యకాలంలో వీరిద్దరూ మళ్లీ పెళ్లి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పదేపదే తమ లవ్ రిలేషన్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళిద్దరూ ఏ స్థాయిలో సందడి చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాని స్వయంగా నరేష్ నిర్మించాడు. ఇక వీరిద్దరు జంటగా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నారట ఈ జంట. వచ్చే సినిమాల్లో కూడా వీళ్ళిద్దరూ కలిసి జంటగా నటించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట. ఈ క్రమంలోనే నరేష్ ఇతర భాషల్లో సక్సెస్ అయిన సినిమాల కథలను తీసుకుని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: