ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ హీరో సిద్దార్థ్.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో తెలుగులో తన మార్కెట్ కోల్పోయాడు. ఈ మధ్య 'మహాసముద్రం' చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇప్పుడు సిద్ధార్థ్ తమిళంలో నటించిన 'టక్కర్' సినిమా తెలుగులోకి అనువాదమైంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..ఒకప్పుడు చక్కటి ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సిద్ధార్థ్.. ఆ తరహా సినిమాలు చేసి చేసి విసుగెత్తిపోయి 'టక్కర్' లాంటి యాక్షన్ థ్రిల్లర్ ట్రై చేసినట్లు ఇటీవల చెప్పుకున్నాడు. కానీ అతను చేసిన ప్రేమకథలు ఎంత మొహం మొత్తినా కానీ ఖచ్చితంగా అక్కడక్కడా కొన్ని మంచి మూమెంట్స్ అయినా ఉండేవి. లవర్ బాయ్ పాత్రల్లో ఆయనతో యూత్ ఎంతో కొంత కనెక్ట్ అయ్యేవాళ్లు. కానీ లవర్ బాయ్ ఇమేజ్  నుంచి బయటికి రావడం కోసం అతను చేసిన 'టక్కర్'ను భరించడం మాత్రం చాలా కష్టమే.ఇంటర్వల్ దాకా ఓ పర్వాలేదు అనిపించే 'టక్కర్' సెకండ్ హాఫ్ నుంచి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.


ఆల్రెడీ కిడ్నాప్ అయిన హీరోయిన్ని హీరో తీసుకెళ్లిపోవడం ఇంకా అతడి వెనుక రౌడీలు పడటం.. ఈలోపు థ్రిల్లింగ్ సీన్లు చూడబోతున్నాం అనుకుంటే.. దర్శకుడు మాత్రం ఓవైపు విలన్ బ్యాచ్ తో సిల్లీ కామెడీ సీన్లు ఇంకా మరోవైపు హీరో హీరోయిన్ల మధ్య ఫీల్ లేని రొమాంటిక్ సీన్లు పెట్టి సినిమాను ముందుకు నడిపించడానికి చాలా తంటాలు పడ్డాడు. మినిమం ఇంట్రెస్టింగ్ కలిగించని సీన్లతో 'టక్కర్' సెకండాఫ్.. ఇంకెప్పుడు అయిపోతుందిరా బాబు అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది.సిద్ధు పాత్ర ఇంకా గెట్ అప్ ఏమాత్రం బాగోలేదు. అన్నీ కొంచెం తేడాగా అనిపించాయి . సిద్ధు స్క్రీన్ ప్రెజెన్స్.. నటన పర్వాలేదు అనిపిస్తాయి. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ అయితే చూడ్డానికి హాట్ గా క్యూట్ గా బాగుంది. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించింది. తన నటన కూడా పర్వాలేదు. ఇక విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ చాలా మామూలుగా అనిపించాడు. అందుకే తన పాత్రలోనే ఏ ప్రత్యేకతా కనిపించలేదు. ఇక యోగిబాబు కామెడీ ఓ మోస్తరుగా నవ్వులు పంచింది. మిగతా నటీనటులంతా కూడా మామూలే.

మరింత సమాచారం తెలుసుకోండి: