పాన్
ఇండియా స్టార్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ
సినిమా రిలీజ్ కోసం ప్రపంచమంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.రామాయాణం
మహా కావ్యం ఆధారంగా
బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మైథలాజికల్ మూవీని తెరకెక్కించారు.ఈ సినిమాలో కృతిసనన్ సీతమ్మ పాత్రలో నటించగా, బాలీవుడ్ సీనియర్ స్టార్
హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్,
యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ సుమారు ఏకంగా రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ పౌరాణిక
మూవీ జూన్ 16న చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్
మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేస్తోంది. ఇక ఇప్పటికే పలు నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై రోజుకో రూమర్ క్రియేట్ అవుతోంది. ఇక వీటిపై స్పందించిన
మూవీ యూనిట్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరొక న్యూస్ నెట్టింట బాగా వైరలవుతోంది.
ఇక
ఆది పురుష్ ప్రదర్శిచే థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచనున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే దీనిపై కూడా కొంతమంది మాత్రం నెగెటివ్ రూమర్స్ క్రియేట్ చేశారు. ఇక ఆదిపురుష్
మూవీ యూనిట్ హనుమంతుడి ప్రత్యేకంగా సీట్ కేటాయిస్తోంది భక్తితో కాదని.. దానిని కూడా వారు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం బాగా ఊపందుకుంది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఈ సీటు పక్కనున్న సీటు కోసం థియేటర్లు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.ఇక మరికొందరు ఖాళీ సీట్ల పక్కనే ఉన్న సీట్లకు టిక్కెట్లు కొని బ్లాక్‌లలో పెట్టి భారీ మొత్తానికి విక్రయిస్తున్నారనే కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆదిపురుష్ టీమ్ స్పందించింది. 'ఆదిపురుష్ టిక్కెట్ ధరలపై మీడియాలో ఇంకా సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే కథనాలు వస్తున్నాయి. హనుమంతుడికి రిజర్వు చేసిన పక్కనే ఉన్న సీట్ల ధరల్లో అసలు ఎలాంటి తేడా లేదని, మిగతా సీట్ల లాగానే వాటి ధర ఉంటుందని స్పష్టం చేస్తున్నాం. దయచేసి ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దు.'అని ఆదిపురుష్
మూవీ నిర్మాణ సంస్థ టీ- సిరీస్ ట్వీట్ చేసింది.