గతంలో ఎప్పుడూ చేయని ప్రయోగాలను ఈ సినిమా కోసం మేకర్స్ చేస్తున్నారని తెలుస్తోంది. కమల్ హాసన్ ను గ్రాఫిక్స్ సహాయం తో ఈ సినిమా లో యంగ్ గా చూపించనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. శంకర్ చేస్తున్న ఈ ప్రయోగాలు సినిమాకు ప్లస్ అవుతాయో లేక మైనస్ అవుతాయో తెలియాల్సి ఉంది.డైరెక్టర్ శంకర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. శంకర్ కు గత కొన్నేళ్లుగా వరుస షాకులు తగులుతున్నాయనే సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్ స్కిల్స్ మీద ప్రేక్షకుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. శంకర్ తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది. శంకర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి