మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో వైష్ణవి తేజ్ కూడా ఒకరు. మొదట ఉప్పెన చిత్రంతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా తన మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరారు.. అటు తరువాత డైరెక్టర్ కొండపొలం అనే చిత్రాన్ని చేశారు. ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది.ఆ తర్వాత రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కామెడీ పరంగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.తర్వాత నాలుగవ చిత్రం ఆదికేశవ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.


అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రం వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు.. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది శ్రీ లీల బర్తడే సందర్భంగా ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి కావాల్సి ఉండగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.


ఆగస్టు 15 నుంచి నవంబర్ 10వ తేదీకి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం ఈ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వాయిస్ నవతే చిత్రంతో పూర్తిగా కంప్లీట్ యాక్షన్ జోనర్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం పైన వైష్ణవ తేజ్ మంచి హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది కచ్చితంగా ఆదికేశవ సినిమా సక్సెస్ కావడంతో తన కెరియర్ మారిపోతుందని ధీమాతో ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో కూడా ప్రారంభంలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ కొట్టలేదు మరి ఆదికేశవ సినిమాతో తన ఫేట్ మార్చుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: