ఈమూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అనేకమంది సెలెబ్రెటీలు ‘జవాన్’ యూనిట్ కు మరీ ముఖ్యంగా షారుఖ్ ఖాన్ కు ముందుగానే అభినందనలు తెలియచేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ షారూఖ్ కు అభినందనలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన సందేశానికి షారూఖ్ ఎవరు ఊహించని రీతిలో స్పందించాడు.
మహేష్ కు తన కృతజ్ఞతలు తెలియ చేస్తూ ‘జవాన్’ మూవీని మహేష్ కు సంబంధించిన ఎ ఎమ్ బి ధియేటర్స్ లో తాను మహేష్ తో కలిసి కూర్చుని ‘జవాన్’ మూవీని చూడాలని ఉందని దానికి మహేష్ అంగీకరిస్తాడా అంటూ సోషల్ మీడియాలో మహేష్ కు పెట్టిన ప్రశ్నకు మహేష్ ఎలాంటి సమాధానం ఇస్తాడో అంటూ చాలామంది ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి రాజమౌళి మహేష్ తో త్వరలో మొదలుపెట్టబోతున్న మూవీలో విలన్ పాత్రను అమీర్ ఖాన్ తో కానీ లేదంటే షారూఖ్ ఖాన్ చేత కానీ చేయించి ఆమూవీని 2000 కోట్ల కలక్షన్స్ క్లబ్ లో చేర్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు షారూఖ్ మహేష్ ల మధ్య ఏర్పడుతున్న సాన్నిహిత్యం రాజమౌళి ప్రయత్నాలకు సహకరిస్తుందేమో చూడాలి.
ఈమూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ఈమూవీ ‘పఠాన్’ కలక్షన్స్ ను బ్రేక్ చేయడం ఖాయం అని అనిపిస్తోంది. ఈమూవీలో నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్న పరిస్థితులలో ఈమూవీ సక్సస్ అయితే నయన్ పేరు బాలీవుడ్ లో మారుమ్రోగి పోవడం ఖాయం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి