సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం జైలర్.. ఈ సినిమాని సన్ పిక్చర్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. గత నెల 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. భారీ విజయంతో పాటు రికార్డు కలెక్షన్స్ కూడా రాబట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ మరొకసారి తన సత్తాచాటారు. గత కొన్నేళ్లుగా రజనీకాంత్ సక్సెస్ లేక సతమతమవుతున్న సమయంలో జైలర్ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమా దాదాపుగా 600 కోట్ల రూపాయలు సాధించి రజనీకాంత్ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది జైలర్ సినిమా.


అయితే రజిని ఏ డైరెక్టర్ కూడా ఇంత హుందాగా చూపించలేదని కూడా చెప్పవచ్చు.. రజినీకాంత్ అభిమానులు థియేటర్లో నానా హంగామా చేశారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్లో రజిని డైరెక్టర్ ను అవమానించాడంట అభిమానులు చాలా ఫైర్ అవుతున్నారు. ఏ సినిమా అయినా సరే ఒక డైరెక్టర్ తన కథను నమ్మి సినిమాను తీస్తారు.. సినిమా ముందు ఎలా ఉన్నప్పటికీ పూర్తి అయ్యి విడుదలై వచ్చేసరికి ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అనే విషయం తెలిసిపోతుంది..


కథను నమ్మి డైరెక్టర్ ఎలా అయితే తీస్తారో హీరో కూడా కథను అలాగే నమ్మాలి కానీ రజనీకాంత్ మాత్రం జైలర్ సినిమా కిట్టు కాదని నమ్మాను అని తెలియజేశారు. రీ రికార్డింగ్ పూర్తికాకముందే నెల్సన్ స్నేహితుడు సన్ పిక్చర్ కి చెందిన వ్యక్తి సినిమాను చూసాము నెల్సన్ స్నేహితుడికి సినిమా బాగా నచ్చింది.సూపర్ హిట్ అన్నారు.. అయితే నెల్సన్ స్నేహితుడు కాబట్టి అలా అనిపిస్తుంది సినిమా అభో అవేరేజ్ అని చెప్పాడట రజనీకాంత్.అయితే అనురూద్ మ్యూజిక్ వాళ్ళని ఈ సినిమా హిట్ అయిందని డైరెక్టర్ ది ఏమీ లేదని ఇన్ డైరెక్టుగా రజనీకాంత్ అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: