కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన విజయ్ దళపతి ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. త్వరలోనే డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రాబోతున్న లియో సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లియో సినిమా రిలీజ్ ను భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అయిపోయిన తర్వాత విజయ్ 68వ సినిమా డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుని త్వరలోనే సెట్స్ మీదికి వెళ్ళబోతున్నట్లు సమాచారం.


ఈ సినిమాలో హీరోయిన్ గా ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.. సీనియర్ హీరోయిన్ జ్యోతిక, స్నేహా కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యనే జ్యోతిక కూడా రీఎంట్రీ ఇచ్చింది విజయ్ సినిమాలో జ్యోతిక నటించడం సినిమాకు స్పెషల్  క్రేజ్ ను తీసుకురావడం జరుగుతోంది. ఇందులో విలన్ గా అరవిందస్వామి నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు  హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన అరవిందస్వామి విలన్ గా పలు సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. ఇదివరకే అరవిందస్వామి చేసిన నెగిటివ్ రోల్ కి ఇది చాలా ప్రత్యేక కరంగా ఉంటుందని తెలుస్తోంది.


ఈ సినిమాకు యువన్ శంకర్రాజ మ్యూజిక్ అందించబోతున్నట్లు సమాచారం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తున్నది. విజయ్ లియో తర్వాత పూర్తిగా వెంకట్ ప్రభు సినిమా మీద ఫోకస్ చేయబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వెంకట్ ప్రభు నాగచైతన్య తో కస్టడీ సినిమాని చేయడం జరిగింది ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: