టాలీవుడ్ లో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. గ్లామర్ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు సోషల్ మీడియాలో సైతం ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఆమె. ఏ విషయం నైనా సరే డైరెక్ట్ గా చెప్పి ఏదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. తన పర్సనల్ విషయాల పైన సైతం ఓపెన్ గా మాట్లాడుతుంటుంది. అయితే తాజాగా తన భర్త భరద్వజ్ ను వివాహం చేసుకోవడంపై కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది.

అయితే అనసూయది ప్రేమ వివాహం అని చాలామందికి తెలిసి ఉంటుంది. ఇంటర్లో ఉన్నప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకే ప్రేమలో పడ్డారు. అనసూయ సైతం ఒక ఏడాది పాటు తనను తెప్పించుకొని ఓకే చేసి తొమ్మిది ఏళ్లపాటు ప్రేమించుకుని 2010లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోలేదు అని కానీ ఇద్దరు పట్టుబడి మరీ ఒపించి వాహనం చేసుకున్నట్లుగా చాలా ఇంటర్వ్యూస్ లో వెల్లడించింది అనసూయ. ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. 9 ఏళ్ల ప్రేమలో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య కుల

 ప్రస్తావన ఒక్కసారి కూడా రాలేదు అని అంటుంది ఈ చిన్నది.  కేవలం లగ్నపత్రిక రాసే సమయం వరకు అనసూయ భర్త కులం ఏంటి అన్న విషయం కూడా తనకు తెలియదు అని తాజాగా పెద్దకాపు 1 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది అనసూయ. కుల మతాలను నేను ఎక్కువగా పట్టించుకోను అని లగ్నపత్రిక రాసే వరకు భరద్వాజ్ గోత్రం కులం ఏంటి అన్నది కనీసం నాకు తెలియదు అని... తామిద్దరం కుల మతాలను అస్సలు పట్టించుకోము అంటూ వెల్లడించింది. దీంతో అనసూయ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: