
తాజాగా భగవంత్ కేసరి సినిమా గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది అదేమిటంటే.. కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాల విషయాల నుండి బాలయ్య భగవంత్ కేసరి సినిమా కోసం ఒక క్లూ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.. అదేమిటంటే ఈ సినిమాలలో హీరోయిన్స్ తో అసలు రొమాన్స్ సన్నివేశాలు లేవు ఈ విషయాన్ని గమనించిన బాలయ్య కూడా ఇందులో కాజల్ తో తనకు రొమాంటిక్ సన్నివేశాలను సైతం ఉండకూడదనే విషయాన్ని డైరెక్టర్ కి తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే ఈ సినిమాలో బాలయ్య, కాజల్ మధ్య ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోవని తెలుస్తోంది.
విక్రమ్, జైలర్ సినిమాలు కేవలం హీరోల మీద డిపెండ్తోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాలను సైతం అందుకోవడం జరిగింది. మరి బాలయ్య కూడా ఇదే జోనర్ లో వెళ్లి మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తోంది అలాగే అర్జున్ రాంపాల్ బాలీవుడ్ హీరో విలన్ గా నటిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తూ ఉన్నారు. కేవలం మూడు రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని బాలయ్య అందుకుంటారేమో చూడాలి మరి