తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న బాలకృష్ణ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? వాటికి సంబంధించిన చిత్రీకరణ ఏ ప్రాంతంలో జరుగుతుంది ..? మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన ఏ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు కాకినాడ పోర్ట్ ఏరియాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు మహేష్ బాబు మరియు కొంత మంది ఇతరులపై జూబ్లీహిల్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు శంషాబాద్ ఏరియాలో ఎన్టీఆర్ పై యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను నిర్వహిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో రామ్ చరణ్ పై ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాల్లో కొన్ని మూవీ ల విడుదల తేదీలను కూడా చిత్ర బృందాలు ప్రకటించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: