మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గాండీవదారి అర్జున అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాక్షా వైద్య హీరోయిన్ గా నటించింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపే కలెక్షన్ లను రాబట్ట లేక పోయింది. దానితో చివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలి పోయింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 24 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ చేస్తుంది.

ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్ లభిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 24 వ తేదీ నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా ... నాజర్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: