తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా జగపతిబాబు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించిన జగపతిబాబు ప్రస్తుతం సెకండ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇన్నింగ్స్ లో జగపతిబాబు ఎక్కువగా విలన్స్ పాత్రలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక జగపతి బాబుకి హీరోగా నటించిన సమయంలో కన్నా విలన్ గా నటించినప్పుడే ఎక్కువ గుర్తింపు లభించింది. అలాగే సంపాదన కూడా ఎక్కువగా ఉంది అంటూ ఒకానొక సమయంలో ఈ విషయాన్ని జగపతిబాబు వెల్లడించారు.

నటుడిగా ఇండస్ట్రీలో జగపతిబాబు ఇంత బిజీగా ఉన్నారు అంటే నటన పట్ల ఆయన చూపించే డెడికేషన్ ఆయనని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాలి. ప్రతి సన్నివేశానికి అనుగుణంగా ఆ పాత్రలో లీనమైపోయి నటిస్తారు జగపతిబాబు అయితే నటించడం వరకు మాత్రమే కాదు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఈయన అదే డెడికేషన్ తోనే డబ్బింగ్ చెబుతారని తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది.ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాకి గాను ఓ డైలాగ్ చాలా గంభీరంగా చెప్పాల్సి వచ్చిందట.  ఈ విధంగా ఆ డైలాగ్ చాలా గంభీరంగా రావాల్సి ఉండడంతో డబ్బింగ్ స్టూడియోలో జగపతిబాబు ఎంతో కష్టపడుతూ చాలా గంభీరంగా ఆ డైలాగ్ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన అనుకున్న విధంగా ఆ డైలాగ్ రాకపోవడంతో ఒకానొక సమయంలో ఈ డబ్బింగ్ చెప్పేటప్పుడు దగ్గు రావడంతో నోటి నుంచి రక్తం  కూడా బయటపడిందట.

ఈ విధంగా డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అన్న ఉద్దేశంతోనే జగపతిబాబు గంభీరమైనటువంటి డైలాగు రావడం కోసం ఇంతలా కష్టపడ్డారని దాంతో ఏకంగా రక్తం రావడంతో అందరూ షాక్ అయ్యారట. అదే సమయంలో డబ్బింగ్ స్టూడియో విజిట్ కోసం వచ్చినటువంటి ఎన్టీఆర్ ఇది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది. నటనపరంగా డెడికేషన్ చూపించే వారిని చూసాము కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అదే డెడికేషన్ చూపించే వారు ఎవరైనా ఉన్నారు అంటే అది జగపతిబాబునే అని ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని బయటపెట్టారు నిజంగా జగపతిబాబు చాలా గ్రేట్.

మరింత సమాచారం తెలుసుకోండి: