
అయితే, రష్మిక లుక్ ని మాత్రం చాలా పద్దతిగా, ప్రశాంతంగా ఉన్నట్లు చూపిచడం విశేషం. ఇక, ప్రపంచానికి అతను ఎంత వైల్డ్ అయినా, అతనికి మాత్రం ఆమే ప్రపంచం అనే క్యాప్షన్ ని కూడా ఇచ్చారు. రష్మిక రోల్ ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు ఎవ్వరూ. రష్మిక లుక్ లో బొట్టు సగం చెరిగిపోయి, జుట్టు చేదిరిపోవడంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.హీరో రణబీర్ రష్మికని ఏదో చేసుంటాడని ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు.రష్మిక ఉల్లు సిరీస్ లో పని మనిషి లాగా ఉందని కొందరు ట్రోల్ చేస్తుంటే కొందరు మాత్రం ఖచ్చితంగా రష్మిక చాలా క్యూట్ గా ఉండంటూ పొగుడుతున్నారు.ఏది ఏమైనా టాక్ తో సంబంధం లేకుండా రష్మిక పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కొందరు మీమర్స్ రక రకాలుగా ఈ పోస్ట్ పై మీమ్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. మొత్తానికి యానిమల్ సినిమాకి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ బజ్ ఏర్పడింది. అందుకే ఈ సినిమాని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చెయ్యబోతున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వనుందో..