ఇండియన్ సినీ పరిశ్రమ లో లోకనాయకుడు గా పేరున్న సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మొదట్లో ఎన్నో పరాజయాలను చవి చూసింది. అయితే ఆమె సినీ ప్రయాణంలో తర్వాత తర్వాత మంచి సూపర్ గహిట్స్ ను అందుకుంది. అయితే ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన చేస్తున్న మూవీ సలార్. ఆ మూవీ పై ఎన్నో అశలు పెట్టుకుంది.రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సినిమా సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత ఆయనకు అంత రేంజ్‌ హిట్‌ ఏ సినిమా తెచ్చిపెట్టలేదు.ఆమధ్య విడుదలైన రామాయణ గాథ ఆదిపురుష్‌ ఆయనకు వ్యధగా మారిందనేది లోకోక్తి. ఇక టైంమిషన్‌ నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ సినిమా లో చేస్తున్నాడు. ఇది విడుదలకు చాలా సమయం వుంది. అయితే కె.జి.ఎఫ్‌.దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం లో ఏడాదికి పైగా రూపొందుతున్న సలార్‌ సినిమా పై ఆశలు ఫ్యాన్స్‌ లో నెలకొన్నాయి. కానీ సినిమా అనుకున్నటైంకు రాకుండా వాయిదా పడుతూవచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు. త్వరలో మరో డేట్‌ ను ప్రకటించనున్నారు.ఈ సినిమా లో శ్రుతిహాసన్‌ నటించింది.

ఇటీవలే హైదరాబాద్‌ లో ఏ వ్యాపార ప్రచారానికి హాజరైంది. సలార్‌ గురించి చెబుతూ, తనకూ ఎంతో ఆతృత గా వుందని విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నట్లు చెప్పింది. ప్రభాస్‌ గురించి చెబుతూ.. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి వుండే లక్షణం ఆయలో చూశాను.aచాలా హంబుల్‌ పర్సన్‌. చాలా గౌరవంగా మాట్లాడతాడు. సీన్‌లో ఇన్‌వాల్వ్‌ అయి ఏదేనా టేక్‌ లోతప్పు చెప్పినా తను సర్దుకుపోయి పర్వాలేదు. మరో టేక్‌ కు ఓకే అంటూ తోటి నటుట్ని ఎంకరేజ్‌ చేస్తారంటూ కితాబిచ్చింది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు నటించారు. హాంబలే ఫిలిమ్స్‌ పై విజయ కిరాగందుర్‌ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: