బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్' ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో షారుఖ్ ఖాన్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు జవాన్ మూవీతో మరోసారి ఆ ఫీట్ సాధించారు షారుఖ్ ఖాన్. ఒకే ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు ఏకంగా రూ.1000 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా 'బాహుబలి-2' సినిమా నిలిచింది.ఇక ఆ తర్వాత 'దంగల్', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2', 'పఠాన్' సినిమాలు ఆ లిస్టులో చేరాయి. ఇప్పటి దాకా మొత్తం ఐదు సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని అందుకోగా, తాజాగా 'జవాన్' సినిమా ఈ ఫీట్ సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 18 రోజుల్లోనే ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.


ఇక ఇప్పటిదాకా మొత్తం ఆరు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరగా అందులో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన రెండు('బాహుబలి-2','ఆర్ఆర్ఆర్') సినిమాలున్నాయి.అయితే హీరోల పరంగా మాత్రం రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న ఏకైక హీరో మాత్రం కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఒక్కరే. అదికూడా ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఆయన ఏ హీరోకి సాధ్యం కానీ అరుదైన రికార్డు సృష్టించారు.పైగా జవాన్ మూవీ నార్త్ అమెరికాలో కూడా 13.5 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ ఏడాది చివరిలో ఆయన నటిస్తున్న 'దున్కి' సినిమా విడుదల కానుంది.ఇక ఆ సినిమా కూడా వెయ్యి కోట్ల ఫీట్ సాధిస్తే, ఇక ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్ల సినిమాల రికార్డు బ్రేక్ కావడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు.ఏది ఏమైనా షారుఖ్ పని అయిపోయింది బాలీవుడ్ ఇక వేస్ట్ అనుకున్న వారికి షారుఖ్ ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. బాలీవుడ్ కి తిరిగి పాత వైభవాన్ని తీసుకోచ్చి మళ్ళీ ఇండియన్ నెంబర్ 1 హీరోగా తన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: