అతిగా ఆశపడే వాళ్ళు, అనవసరంగా వాదించే వాళ్ళు, సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు, కేవలం డైలాగులు మాత్రమే చెప్పేవాళ్ళు, వెనకాల గోత్రతవే వాళ్ళు కేవలం వంట మాత్రమే చేసేవారు ఇలా ప్రతి బిగ్ బాస్ సీజన్ లో చాలామంది కనిపిస్తూనే ఉంటారు. అయితే ఈ సీజన్లో సైతం అలాంటి వారే ఉన్నారు. ఇక మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా కూడా కేవలం వంటకి పరిమితమైన వాళ్ళు మాత్రం హౌస్ లో ఎక్కువ వారాలు ఉండరు అని చెప్పాలి. అందరికీ వండి పెట్టడం మంచిపని కానీ వంట మాత్రమే చేస్తే మాత్రం కష్టం. దామిని విషయంలో సైతం  ఇదే జరిగింది.

ఎప్పుడు చూసిన వంట గదిలోనే పనులు చేసుకుంటూ కిచెన్ లో ఏ మాత్రం తేడా వచ్చినా ఎవరు పనిచేయకపోయిన నోరు పారేసుకుని ఎదుటివారిపై మండిపోయేది. అందుకే దానికీ వంటలక్క వార్డెన్ అన్న పేర్లు సైతం ఇప్పటికే చాలామంది ఫిక్స్ చేశారు. కేవలం వంట పనికి మాత్రమే పరిమితమై ఆటకు దూరం అవ్వడమే దామిని ఎలిమినేషన్ కి ప్రధాన కారణం అని అంటున్నారు. అయితే కొన్నిసార్లు తన మాటకు వైఖరికి అస్సలు పొంతన ఉండదు బూతులు మాట్లాడితే నచ్చదు అని చిరాకు పడ్డా కూడా దామునికి ఏమాత్రం నచ్చదు అని ఎప్పుడూ చెప్తూ ఉండే ఆమె..

తను మాత్రం ఇంగ్లీషులో బూతులు విచ్చలవిడిగా మాట్లాడేసేది. ఒక టాస్క్ లో అయితే ప్రిన్స్ లో వీర లెవెల్లో టార్చర్ పెట్టేసింది. పేడ ముఖాన కొట్టడమే కాకుండా తన నోటిలో కూడా వేసేసింది. ఇది టాస్కే అయినప్పటికీ గ్యాప్ ఇవ్వకుండా నోటిలో పేడ కొట్టడం అన్నది క్రూరత్వం అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఎప్పటికీ ఇప్పుడు దామిని ఎలిమినేట్ అవ్వడంతో చాలామంది ఖుషీ అవుతున్నారు. ఎందుకు అంటే దామని కి బిగ్ బాస్ హౌస్ ఏమాత్రం కరెక్ట్ కాదు అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనాప్పటికీ ఇంకొన్ని వారాలు ఉండాలి అనుకున్నదామిని అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుండి మూడవ వారంలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఇక ఎన్ని వారాలకి గాను దామిని రెమ్యూనరేషన్ ఎంత అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ బాహుబలి సింగర్ వారానికి రెండు లక్షల మేరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ లెక్క ప్రకారం చూస్తే 3 వారాలకి ఆరు లక్షల రెమ్యూనరేషన్ దామిని ఇంటికి పట్టుకెళ్ళినట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: