
ఇప్పుడు తాజాగా రాజకీయ విషయం పైన ఒక ఆసక్తికరమైన నోట్ రాసుకొచ్చింది పూనమ్ కౌర్.. ఇలా రాసుకోస్తూ నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు.. ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని.. కేవలం సమస్యపైనే తాను స్పందిస్తూ ఉంటానని కొంతమంది రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం తనని వాడుకున్నారని తెలియజేసింది. ఇది సరైన నిర్ణయం కాదు.. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చాలా చేశారు మరి కొంతమంది వారి యొక్క పైశాచిక ఆనందం కోసం ఇలా చేశారు ఒక మహిళ పైన ఇలాంటి కుట్రలు తగవు అంటూ సానుభూతి పేరుతో తన కుటుంబానికి తనకు ఫోన్లు చేస్తూ ఉన్నారని తెలిపింది..
నేను సిక్కుబిడ్డను మాకు త్యాగాలు మాత్రమే తెలుసు పోరాటాలు తెలుసు దయచేసి తనని తమ రాజకీయాల కోసం లాగొద్దు ప్రస్తుతం తాను చేనేత కళాకారుల కోసమే పని చేస్తున్నానని గత రెండు సంవత్సరాలుగా వారి కోసమే జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త అయిన వెంకన్న నేత గారితో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని తెలియజేసింది. ఇప్పటికే 15 రాష్ట్రాలు 21 రాజకీయ పార్టీలకు సంబంధించి వంద మందికి పైగా పార్లమెంటు సభ్యులను కలిసి వారి మద్దతు తీసుకున్నాను అంటూ తెలిపారు ఈ ప్రయాణంలో చాలామంది సామాజిక ఉద్యమకారులను కూడా కలవడం జరిగింది అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ నోట్ వైరల్ గా మారుతోంది.